టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు నాగచైతన్య నుండి ఇటీవల రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చాయి. చైతు కీ రోల్ చేసిన లాల్ సింగ్ చద్దా, సోలో హీరోగా నటించిన థాంక్యూ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి.
దీంతో చైతు సోలో హీరోగా గట్టి హిట్ కొట్టే సమయం ఆసన్నమైందని, కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చైతు చెయ్యబోతున్న మూవీ సూపర్ హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ ఏడాది మొదట్లోనే నాగ చైతన్యతో ద్విభాషా చిత్రాన్ని ప్రకటించారు వెంకట్ ప్రభు. ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని చిన్న అప్డేట్ కూడా ఇచ్చారు.
లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ పై బిగ్ అప్డేట్ దొరికింది. రేపటి నుండే హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. నాగచైతన్య కెరీర్ లో 22వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, SS స్క్రీన్స్ నిర్మిస్తుంది.