నందమూరి బాలకృష్ణ తొలిసారిగా తెలుగులో క్రేజీ OTT టాక్ షోను నిర్వహించారు. అదే “అన్‌స్టాపబుల్”. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో ప్లాన్ చేసిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో చాలా మంది సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇప్పుడు ఈ సీజన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ దసరా కానుకగా సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌ని మేకర్స్ ప్లాన్ చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ అక్టోబర్ మొదటి 2 వారాల్లోనే ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే ఛాన్స్ ఉంది. మరి దీనికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ త్వరలో రానుంది. ఎనర్జిటిక్ బాలయ్యను హోస్ట్‌గా చూడాలని బాలయ్య అభిమానులు ఇప్పటికే చాలా ఆసక్తిగా ఉన్నారు.