'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ పైకి ఉవ్వెత్తున ఎగసిన కెరటం కృతిశెట్టి. ఈ కన్నడ భామ కమర్షియల్ యాడ్స్ తో సినీ కెరీర్ ను మొదలుపెట్టి ఆపై హృతిక్ రోషన్ "సూపర్ 30"లో స్టూడెంట్ గా వెండితెర అరంగేట్రం చేసింది.
హీరోయిన్ గా డెబ్యూ చేసింది మాత్రం తెలుగు సినిమా "ఉప్పెన"తోనే. తొలి సినిమానే అయినా ఉప్పెనలో కృతి చాలా పరిణతి కలిగిన హీరోయిన్ లా నటించి, మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కృతి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.
ఉప్పెన క్రేజ్ తో కృతికి వరసపెట్టి స్టార్ హీరోల సరసన ఛాన్సులు వచ్చాయి. బంగార్రాజు, శ్యామ్ సింగ రాయ్ లతో హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కృతి ఆపై నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలతో కాస్తంత వెనకబడింది. కానీ ఆఫర్లకు మాత్రం ఎలాంటి ఢోకా రాలేదు. నాగచైతన్య NC 22, వనంగాన్ సినిమాలలో కృతినే హీరోయిన్.
పోతే, ఈ రోజు కృతి పుట్టినరోజు. సెప్టెంబర్ 21, 2003లో ముంబైలో పుట్టిన కృతికి ఈ రోజుతో 19 ఏళ్ళు నిండాయి. సినీరంగంలో సుదీర్ఘ భవిష్యత్తు కలిగిన కృతికి హ్యాపీ బర్త్ డే చెప్దామా...!