పోయిన గురువారం విడుదల కావాల్సిన గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ 'తార్ మార్ తక్కర్ మార్' లిరికల్ వీడియో ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు విడుదల కాబోతుంది. ఈ సాంగ్ కోసం మెగా అభిమానులు వేకళ్ళతో ఎదురుచూస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ చెయ్యట్లేదని నిన్నటి వరకు గాడ్ ఫాదర్ మేకర్స్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, నిన్న చిరు రిలీజ్ చేసిన పది సెకన్ల ఆడియో టేప్ ఈ సినిమాకు కావాల్సినంత బజ్ ను తీసుకొచ్చేసింది.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్న ఈ మూవీ అక్టోబర్ ఐదవ తేదీన దసరా కానుకగా విడుదల కాబోతుంది.