నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో, మాస్ రాజా రవితేజ నటిస్తున్న ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ "ధమాకా". ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది.
ఇటీవలే ఈ సినిమా నుండి జింతాక్ అనే మాస్సీ లిరికల్ సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్గా నిలిచింది. లేటెస్ట్ గా ధమాకా మేకర్స్ మరో మాస్సీ లిరికల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. మాస్ రాజా అనే పాటను సెప్టెంబర్ 23న సాయంత్రం 05:01 గంటలకు విడుదల చెయ్యనున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.
ఈ సినిమా ఔటండౌట్, రవితేజ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తాలూకా ఔట్ పుట్ కూడా బాగా వచ్చిందని టాక్. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.