సినిమాలకు సంబంధించి బాక్సాఫీస్ కలెక్షన్స్ రేటింగ్స్ అందించే ఓర్మాక్స్ సంస్థ నిర్వహించిన 'మోస్ట్ పాపులర్ మేల్ స్టార్' సర్వేలో తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ అగ్ర స్థానంలో నిలిచాడు.రెండో స్థానంలో ప్రభాస్, మూడో స్థానంలో ఎన్టీఆర్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. యశ్-5, అక్షయ్ కుమార్-6, రామ్ చరణ్-7, మహేష్ బాబు-8, సూర్య-9, అజిత్ కుమార్- 10వ స్థానాలులో ఉన్నారు.మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ టాప్ 10 లిస్ట్‌లో సమంత నంబర్ 1. మిగిలిన తొమ్మిది మందిలో అలియా భట్, నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొనే, రష్మిక, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, పూజా హెగ్డే మరియు అనుష్క శెట్టి ఉన్నారు.