విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'లైగర్'. ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయినిగా నటించింది.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని కరణ్ జోహార్,పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.