నాచురల్ స్టార్ నాని నటించిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ "అంటే సుందరానికి". ఈ ఏడాదిలోనే విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టి, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా మంచి రివ్యూలు పొందింది.
వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లేటెస్ట్ గా బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం ఆరింటికి జెమిని టీవీలో ఈ మూవీ ప్రీమియర్ కానుంది.
మలయాళ బ్యూటీ నజ్రియా ఫాహద్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో నరేష్, నదియా, అనుపమ పరమేశ్వరన్, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషించారు.