మాస్ రాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న "ధమాకా" మూవీ షూటింగ్ ఎప్పటినుండో జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. ఇకపై, ఎక్జయిటింగ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ... అంటూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
నక్కిన త్రినాధరావు ఈ సినిమాకు దర్శకుడు కాగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.