విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. నేటి (గురువారం) నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిస్నీ+హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అనన్యపాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైంది.