ఫస్ట్ ఎవర్ సర్వైవల్ థ్రిల్లర్ ఇన్ తెలుగు సినిమా అని ప్రచారం చేయబడుతున్న "దొంగలున్నారు జాగ్రత్త" సినిమా రేపే థియేటర్లో సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది.
కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నారు. సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి నిర్మిస్తున్న ఈ చిత్రం లో ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తుంది.
సతీష్ త్రిపుర ఈ సినిమాకు దర్శకుడు కాగా, కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై విశేషాసక్తిని కలిగించింది.