శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా, తెలుగు డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్న చిత్రం "ప్రిన్స్". తెలుగు, తమిళ భాషలలో దీపావళికి థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి వరస లిరికల్ సాంగ్స్ అప్డేట్ వస్తున్నాయి.
ఫస్ట్ లిరికల్ వీడియో చార్ట్ బస్టర్ లా నిలవగా, లేటెస్ట్ గా నిన్న సాయంత్రం జెస్సికా అనే సెకండ్ లిరికల్ వీడియో విడుదలైంది. తమన్ స్వరపరచి, ఆలపించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి గారు సాహిత్యం అందించారు. సతీష్ కృష్ణన్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసారు.
పోతే, ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు.