నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ "ఆ అమ్మాయి గురించి మీకుచెప్పాలి" ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో రన్ అవుతుంది.
సుధీర్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం "హంట్". ఈ సినిమాకు మహేష్ డైరెక్టర్ కాగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి అప్డేట్ వచ్చింది. కీలక పాత్ర పోషిస్తున్న శ్రీకాంత్ క్యారెక్టర్ పోస్టర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. దీనిని బట్టి ఇందులో శ్రీకాంత్ 'మోహన్ భార్గవ్' అనే సీరియస్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.