"అతడే శ్రీమన్నారాయణ" సినిమాతో తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించిన కన్నడ హీరో కం డైరెక్టర్ రక్షిత్ శెట్టి. ఆయన సోలో హీరోగా నటించిన విభిన్నమైన చిత్రం "777చార్లీ". ఈ సినిమా పాన్ ఇండియా రేంజులో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో జూన్ 10వ తేదీన విడుదలై, సూపర్ హిట్ అయ్యింది.
కిరణ్ రాజ్ దర్శకత్వంలో కామెడీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జి.ఎస్ గుప్తా తో కలిసి రక్షిత్ శెట్టి నిర్మించారు. ప్రేక్షకుల నుండి ముఖ్యంగా పెంపుడు కుక్కలను ప్రాణంగా చూసుకునే వారినుండి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది.
777చార్లీ కన్నడ వెర్షన్ వూట్ సెలెక్ట్ లో స్ట్రీమింగ్ కొచ్చింది. మిగిలిన భాషల స్ట్రీమింగ్ పై లేటెస్ట్ గా సూపర్ అప్డేట్ వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో సెప్టెంబర్ 30 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 777 చార్లీ స్ట్రీమింగ్ కానుంది. ఐతే, ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడాలంటే, రెంట్ కట్టాల్సిందే. పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కొచ్చి అందరికి షాక్ ఇచ్చింది.