కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ తగిలించుకుంది గ్లామరస్ బ్యూటీ నయనతార. కొన్నాళ్లబట్టి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం నటనకు ప్రాధాన్యమున్న లేడీ ఓరియెంటెడ్ మూవీలనే చేస్తూ, లేడీ సూపర్ స్టార్ బిరుదును సార్ధకం చేసుకుంటుంది.
ఈ ఏడాది జూలై లో నయనతార వివాహం జరిగింది. ఆరేళ్ళ బట్టి ప్రేమించిన డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను నయన్ డ్రీమి ఫెయిరీ టేల్ తరహాలో వివాహం చేసుకుని అందరిని అబ్బురపరిచింది. ఆమె వివాహం ప్రతి అభిమాని, ప్రేక్షకుడు లైవ్ లో చూడలేకపోయారు కాబట్టి, నెట్ ఫ్లిక్స్ తో నయన్ డీల్ కుదుర్చుకుని ఆమె వివాహాన్ని డాక్యుమెంటరీ గా తీసి, స్ట్రీమింగ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఈ విషయాన్ని రీసెంట్గానే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించగా, లేటెస్ట్ గా నయన్ వెడ్డింగ్ టీజర్ ను విడుదల చేసి, ఆమె పెళ్లి వీడియో స్ట్రీమింగ్ పై మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఐతే, స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడన్నది నెట్ ఫ్లిక్స్ ఇంకా రివీల్ చెయ్యలేదు.