ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"డీజే టిల్లు" ను రిజెక్ట్ చేసిన మరొక యంగ్ బ్యూటీ..?

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 06:35 PM

ఈ ఏడాదిలో విడుదలై ఘనవిజయం సాధించిన చిన్న సినిమా "డీజే టిల్లు". ఈ సినిమా అప్పటివరకు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని హీరో సిద్ధూ జొన్నలగడ్డ కు చాలా మంచి పేరును తీసుకొచ్చింది. అలానే, ఈ మూవీ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరిచింది.
లేటెస్ట్ గా ఈ మూవీ సీక్వెల్ పై ఇంటరెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటంటే, ఈ మూవీలో హీరోయిన్ గా నటించాల్సిన నేహా శెట్టి ఈ సినిమా నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఐతే లేటెస్ట్ గా మరొక బ్యూటీ కూడా డీజే టిల్లును కాదని వెళ్లిపోయిందని టాక్. ఆమె ఎవరో కాదు... పెళ్ళిసందడి ఫేమ్ శ్రీలీల. అంతకుముందు ఈ సినిమాలో మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరిగింది.
ఈ విషయం పక్కన పెడితే, రెండ్రోజులు షూటింగ్ లో పాల్గొని కూడా శ్రీలీల ఈ సినిమా నుండి తప్పుకోవడం ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి, ఈ విషయాలపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa