ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. గణేష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతి ముత్యం'. ఈ రొమాంటిక్ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను రెట్టింపు చేసింది. ఓవరాల్ గా ట్రైలర్ లో గణేష్, వర్ష మధ్య కెమిస్ట్రీ, అలాగే విజువల్స్, డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో, పోస్టర్లు ఆకట్టుకోవడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.