కమల్ హాసన్ "ఇండియన్ 2" తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది నటి కాజల్ అగర్వాల్. దాదాపు దశాబ్దం పాటు టాలీవుడ్ చందమామగా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేసింది. ఆపై పెళ్లి చేసుకుని, రీసెంట్గానే ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యి, ఇప్పుడు మరోసారి సినీరంగాన్ని ఏలడానికి సిద్ధం అవుతుంది.
ఈ క్రమంలో కాజల్ తిరుమల శ్రీవారి ఆశీస్సులను పొందడానికి ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకుంది. VIP దర్శన విరామ సమయంలో కాజల్ మరియు ఆమె భర్త గౌతమ్ కిచ్లు, ఆమె తల్లి శ్రీవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలను అందుకున్నారు. తదుపరి గుడి బాహ్యస్థాలానికి వచ్చిన కాజల్ మీడియాతో ముచ్చటించి, తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.