కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "శబరి". తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతుంది.
ఈ సినిమాని కొత్త దర్శకుడు అనిల్కట్జ్ అకా అనిల్ కుమార్ రూపొందిస్తున్నారు. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాధ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహర్షి కొండ్ల సమర్పిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఒక కీ అప్డేట్ వచ్చింది. ఉగాది పండగ నుండి షూటింగ్ మొదలెట్టిన చిత్రబృందం ఇటీవలే కొడైకెనాల్ లో ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది.