నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం "మంత్ ఆఫ్ మధు". 2015లో విడుదలైన త్రిపుర సినిమాలో తొలిసారిగా జంటగా నటించిన నవీన్ చంద్ర, స్వాతి తిరిగి ఈ సినిమాలో మరోసారి జోడిగా నటిస్తున్నారు.
శ్రీకాంత్ నాగోతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుండి కొంచెంసేపటి క్రితమే టీజర్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 29వ తేదీన మంత్ ఆఫ్ మధు టీజర్ ను విడుదల చెయ్యబోతున్నట్టు ఇంటరెస్టింగ్ పోస్టర్ ద్వారా తెలిపారు.
అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, రాజీవ్ ధరావత్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. యశ్వంత్ ముల్లుకుట్ల నిర్మిస్తున్నారు.