కింగ్ నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ "ది ఘోస్ట్". ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ కర్నూల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కు నాగచైతన్య, అఖిల్ లతో కలిసి నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ... శివ సినిమా విడుదలైనప్పుడు ఆ మూవీ సౌండ్ డిజైన్ తో ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. అందులో సైకిల్ చైన్ ఒక ఐకానిక్ వెపన్ రిఫరెన్స్ గా నిలిచింది. అప్పట్లో జనాలు చాన్నాళ్లు ఈ సినిమా గురించి, సైకిల్ చైన్ సీన్ గురించి మాట్లాడుకున్నారు. తాజాగా ఘోస్ట్ సినిమాలో పొడవాటి కత్తిని వాడాను. ఖచ్చితంగా ఈ సినిమా గురించి కూడా జనాలు మాట్లాడుకుంటారు. ప్రవీణ్ సత్తారు గొప్పతనం గురించి తెలుసుకుంటారు. కత్తితో చేసే హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను అలరిస్తాయి... అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కాబోతున్న చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ కూడా గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని నాగార్జున కోరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa