కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న తొలి బైలింగువల్ చిత్రం "వారిసు". తెలుగులో "వారసుడు" టైటిల్ తో విడుదల కాబోతుంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రెండు పాటలు, రెండు యాక్షన్ ఎపిసోడ్లు మినహాయించి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైపోయిందట. నిన్ననే ఈ మూవీ న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. 2023 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడే అవకాశాలున్నాయని ఈ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఐతే, అలాంటిదేమి లేదని, షెడ్యూల్డ్ డేట్ కే విజయ్ థియేటర్లలో సందడి చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తున్నారని అర్ధం అవుతుంది.
పోతే, ఈ మూవీలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa