"ది ఘోస్ట్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ... అఖిల్ మరియు తాను త్వరలోనే వెండితెరపై కలిసి కనిపించబోతున్నాం అని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మొదట్లో విడుదలైన "బంగార్రాజు" సినిమాలో పెద్ద కొడుకు నాగచైతన్యతో నాగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అలానే, త్వరలోనే అఖిల్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్టు, ఆ మూవీ ప్రకటన ఈ ఏడాదిలోనే రావొచ్చని తెలిపారు. అంతేకాక ఘోస్ట్, ఏజెంట్ సినిమాలకన్నా పెద్ద సినిమాగా రూపొందుతుందని కూడా చెప్పారు.
నాగార్జున ప్రకటనతో అక్కినేని అభిమానులంతా ఫుల్ ఖుషి అయ్యారు. అఖిల్ చిన్నప్పుడు వచ్చిన 'సిసింద్రీ', ఆపై 'మనం' సినిమాలలో ఈ తండ్రీకొడుకులు కలిసి నటించగా, ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రీన్ షేరింగ్ మూవీ ఇదే. బజ్ ప్రకారం, ఆ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం చేస్తారని వినికిడి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa