దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కావడానికి రెడీగా ఉన్న మెగాస్టార్ మూవీ "గాడ్ ఫాదర్". ఇటీవల విడుదలైన ఫస్ట్ లిరికల్ 'తార్ మార్ తక్కర్ మార్' సాంగ్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాగా, లేటెస్ట్ గా మేకర్స్ ఈ సినిమా నుండి మరో సాంగ్ ను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు.
"నజభజ" అనే ఈ పాటను ఈరోజు సాయంత్రం 05:04 గంటలకు లిరికల్ రూపంలో విడుదల చెయ్యనున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. తమన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లే రేంజ్ లో ఉంది. మొదటి పాటతోనే ఈ విషయం అర్ధమైపోయింది. మరి రాబోతున్న రెండవ పాటను తమన్ ఎంత పెప్పీగా కంపోజ్ చేసి ఉంటాడని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.