పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలి మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్" అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఒకేఒక్క ట్వీట్ తో ఫుల్ స్టాప్ పెట్టేసారు. ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని బ్యాంక్ ఆఫ్ సరయు లో అక్టోబర్ 2వ తేదీన ఆదిపురుష్ టీజర్ మరియు తొలి పోస్టర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందని ఓం రౌత్ ట్వీట్ చేసారు. ఇంకేముంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్వీట్లు, రీ ట్వీట్లు, పోస్టులు ... సందడే సందడి అన్నట్టుంది పరిస్థితి.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో టి సిరీస్ ఫిలిమ్స్, రెట్రోఫిల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సాచెట్ పరంపర సంగీతం అందించారు.