నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా, సీనియర్ హీరో శ్రీకాంత్, కోలీవుడ్ నటుడు భరత్ నివాస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం "హంట్". హీరో మరియు ముఖ్యపాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ కు టైం ఫిక్స్ చేసారు.
సెప్టెంబర్ 28వ తేదీన అంటే రేపు ఉదయం 11:33 గంటలకు హంట్ టీజర్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాకు మహేష్ డైరెక్టర్ కాగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.