నందమూరి కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడు వశిష్ట కాంబోలో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ ఫాంటసీ థ్రిల్లర్ "బింబిసార". కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఈ సినిమా విజయం సాధించడంతో నందమూరి ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఈ సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించింది. దీని తర్వాత, OTT విడుదలకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ లేదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారం తెలియనుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది మరియు ఈ చిత్రం అక్టోబర్ 7 నుండి ప్రసారం కానున్నట్టుగా తెలుస్తుంది.. మరి దీనికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ రావాల్సి ఉంది.