బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ ఔటండౌట్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యొక్క ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది. 24 గంటల్లో 2.2 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టి యూట్యూబ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావడం సినిమా విజయానికి తొలి మెట్టు అని చెప్పుకోవచ్చు. వెండితెరపై డైరెక్టర్, నటీనటులు మ్యాజిక్ చెయ్యగలిగితే ఈ సినిమా హిట్టయ్యినట్టే.
PDV ప్రసాద్ సమర్పిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు