ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జున "ది ఘోస్ట్" రన్ టైం లాక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 07:36 PM

నాగార్జున నటించిన "ది ఘోస్ట్" మూవీ విడుదల కోసం అక్కినేని అభిమానులు పరితపించిపోతున్నారు. మూవీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచడమే ఇందుకు కారణం.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రన్ టైం 135 నిమిషాలుగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్రానికి భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్ లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa