వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా, ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఒక సినిమాను తెరకెక్కిస్తోంది.
వారాహి చలన చిత్రం బ్యానరుపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంతో రాధా కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెళ్ళి సందడి ఫేమ్ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ కాగా జెనీలియా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుండటం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అత్యుత్తమ టెక్నిషియన్లు పని చేస్తున్నారు.
ఈ మూవీ టైటిల్ ను రేపు సాయంత్రం 06:39 నిమిషాలకు లాంచ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. జూలై నెల నుండి ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. బెంగుళూరులో జరిగిన ఈ మూవీ ప్రారంభ కార్యక్రమానికి దిగ్గజ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ఫస్ట్ క్లాప్ కొట్టారు.