మంచు విష్ణు నటిస్తున్న "జిన్నా" నుండి కొంచెంసేపటి క్రితమే టైటిల్ లిరికల్ వీడియో విడుదలైంది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటను పృథ్వి చంద్ర పాడగా, CK సాహిత్యం అందించారు.
అంతకుముందు విడుదలైన రెండు పాటలు ఫ్రెండ్షిప్ , గోళీసోడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, ఇప్పుడు విడుదలైన టైటిల్ సాంగ్ ఫుల్ మాస్ స్టఫ్ తో కేకపెట్టిస్తుంది.
దసరా రోజున అంటే అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కాబోతుందని ముందుగా ప్రచారం జరిగినా, ఆ తరవాత దీపావళికి అంటే అక్టోబర్ 21వ తేది నుండి థియేటర్లలో జిన్నా సందడి మొదలు కానుందని టాక్. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నారు.