హీరోయిన్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఓ గోల్డ్ స్మిత్ ను ఆమె పెళ్లాడనుందట. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్తలపై అనుష్క ఇంకా స్పందించలేదు. అనుష్క చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చినా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. తాము ఫ్రెండ్స్ అని అనుష్క, ప్రభాస్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.