మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ "చిరుత" సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28, 2007లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
సరిగ్గా నేటితో ఈ సినిమా విడుదలై పదిహేనేళ్ళు. అంటే రామ్ చరణ్ సినీ కెరీర్ స్టార్ట్ అయ్యి పదిహేనేళ్ళన్నమాట. ఈ నేపథ్యంలో ప్రౌడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి రాంచరణ్ పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.
చిరుత తో మొదలైన రామ్ చరణ్ యాక్టింగ్ కేరీర్ ఆపై మగధీర, అటుపై రంగస్థలం, తాజాగా RRR ... రాబోయే RC 15 సినిమా...వరకు నటుడిగా చరణ్ తనను తాను మార్చుకుంటూ వచ్చాడని, చెర్రీకి నటనపట్ల ఉన్న డెడికేషన్, ప్యాషన్ చూస్తే తనకెంతో గర్వంగా అనిపిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటూ మెగాస్టార్ చెర్రీతో కలిసి దిగిన కొన్ని మెమొరబుల్ ఫోటోలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్లు వైరల్ గా మారాయి.