టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు రాజమౌళి, బాహుబలి ఫ్రాంచైజీ సక్సెస్ తర్వాత తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం "RRR". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్, అజయ్ దేవగణ్ కీలకపాత్రలు పోషించారు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన నాల్గవ భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
ఈ సినిమా భారతదేశంలోనే కాక, విదేశాల్లో కూడా ప్రభంజనం సృష్టిస్తుంది. అమెరికా వంటి దేశాల్లో RRR చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. లేటెస్ట్ గా RRR మ్యానియా జపాన్ కి చేరబోతోంది.
అక్టోబర్ 21, 2022 న జపాన్ లో RRR గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు వచ్చే నెల్లో RRR ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్ళబోతున్నట్టు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. తారక్, చరణ్ లు జక్కన్నతో కలిసి వెళ్తున్నారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. `