మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీ VT 13 అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రీసెంట్గానే జరిగింది. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ పన్నెండవ సినిమాపై కూడా సూపర్ అప్డేట్ వచ్చేసింది.
VT 12 అఫీషియల్ ఎనౌన్స్మెంట్ గతంలోనే జరిగినా, ఇప్పటివరకు ఎలాంటి న్యూస్ లేకపోవడంతో, అందరూ ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని అనుకున్నారు. కానీ, లేటెస్ట్ గా VT 12 BTS గ్లిమ్స్ ను విడుదల చేసి త్వరలోనే సూపర్ అప్డేట్ రాబోతుందని మేకర్స్ అఫీషియల్ గా తెలిపారు.
ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకుడు కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. హీరోయిన్, నటీనటుల విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.