త్వరలోనే బాలయ్య డిజిటల్ సందడి మొదలు కానుంది. అదేనండి... ఆహా ఓటిటిలో బాలకృష్ణ హోస్ట్ చేసిన "అన్స్టాపబుల్ విత్ NBK" సెకండ్ సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ షోకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిధిగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయమై గతంలోనే వార్తలు వచ్చినా తాజాగా ఆ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇదే గనక జరిగితే, షో రేటింగ్స్ హై ఎండ్స్ కు చేరడం ఖాయం. రీసెంట్ గా విడుదలైన అన్స్టాపబుల్ స్పెషల్ యాంతెం కు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.