సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజుగారు సెప్టెంబర్ 11వ తేదీన కన్ను మూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణంరాజుగారి సొంతూరు మొగల్తూరులో ఈ రోజు సంస్మరణ సభ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్, కృష్ణంరాజుగారి భార్య శ్యామలాదేవి గారు, వారి కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తిలు తదితర కుటుంబసభ్యులు హాజరయ్యారు.
ప్రభాస్ రాకతో మొగల్తూరులో కృష్ణంరాజుగారి నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. వేలమంది అభిమానులు ప్రభాస్ కోసం నిరీక్షిస్తూ, ఇంటిబయట పడిగాపులు కాస్తున్నారు. తనకోసం వచ్చిన వేలాదిమంది అభిమానుల కోసం ప్రభాస్ రకరకాల నాన్ వెజ్ వంటలను టన్నుల్లో వండిస్తున్నారు. కడుపునిండా భోజనం చేసి వెళ్లాలని అభిమానులకు డార్లింగ్ ఎంతో ఆప్యాయంగా విన్నవించుకున్నారు.