"తిరుచిత్రంబలం" సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, డీసెంట్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాల వ్యవధిలోనే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.
ఈ రోజు నుండే ఆయన నటించిన కొత్త చిత్రం "నానే వరువేన్" మూవీ థియేటర్లలో విడుదలైంది. తెలుగులో ''నేనే వస్తున్నా'' టైటిల్ తో విడుదలైన ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లుఅరవింద్ గారు డిస్ట్రిబ్యూట్ చేసారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ పై అధికారిక క్లారిటీ వస్తుంది. నానే వరువేన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రఖ్యాత ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. సో, త్వరలోనే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కొస్తుందన్నమాట.
పోతే, ఈ సినిమాను సెల్వరాఘవన్ డైరెక్ట్ చెయ్యగా, ఎస్ తను నిర్మించారు. ఇందూజ రవిచంద్రన్, ఎల్లీ అవ్రామ్ హీరోయిన్లుగా నటించారు.