అటు నార్త్, ఇటు సౌత్ ... రెండు సినీ పరిశ్రమలలోనూ భారీ అంచనాల నడుమ విడుదలైంది పాన్ ఇండియా మూవీ "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలై, డీసెంట్ కలెక్షన్లతో రన్ అవుతుంది.
ఈలోపే బ్రహ్మాస్త్ర ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతుంది. ఐతే, ఈ ప్రచారంలో క్లారిటీ లేదు. కొంతమందేమో ఈ మూవీ దసరా కానుకగా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుందని అంటుంటే, మరికొంతమందేమో దీపావళి కానుకగా అక్టోబర్ మూడవ వారంలో ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. ఈ విషయంలో మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వస్తే కానీ, క్లారిటీ వచ్చేలా లేదు.
ఇక, ఈ మూవీని సౌత్ లో రాజమౌళి ప్రోమోట్ చెయ్యడం చాలా ప్లస్ అయ్యింది. అంతేకాక కింగ్ నాగ్ కీలకపాత్ర పోషించడం సౌత్ లో ఈ మూవీ హిట్ అవ్వడానికి మరొక కారణమని చెప్పొచ్చు.