టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇంట్లో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. ఇంటి ప్రాంగణంలోకి ఎత్తయిన గోడపై నుంచి దూకడంతో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని కాపలాదారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి 3 రోజుల కిందట ఒడిశా నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిందితుడిని కృష్ణ(30)గా గుర్తించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో మహేష్ ఇంట్లో లేరు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com