సూపర్ స్టార్ కృష్ణ గారి మొదటి భార్య శ్రీమతి ఇందిరాదేవి గారు నిన్న తెల్లవారుఝామున మరణించిన విషయం తెలిసిందే. అమ్మంటే దేవుడితో సమానమైన మహేష్ బాబుకు ఈ వార్త తెలియడంతో నిలబడిన చోటే కూలబడినంత పనైంది. ఆ బాధతోనే ఇందిరాదేవిగారి అంతిమ సంస్కారాలను పూర్తి చేసిన మహేష్, ఇంకా ఆమెను తలుచుకుంటూ, ఆమె ఇంట్లోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో కృష్ణ గారిని, మహేష్ బాబును తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా కలిసి వారిని పరామర్శించారు. ఇందిరాదేవి గారి చిత్రపటానికి నివాళిని అర్పించి, మహేష్ కుటుంబ సబ్యులకు సానుభూతిని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa