ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్‌ఖాన్ తో కలిసి నటిస్తానని అనుకోలేదు

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 04, 2018, 02:47 PM

2018 నాకు గొప్ప ఏడాది అంటోంది బాలీవుడ్ న‌టి దిశా ప‌టాని. యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాల్లో నటించా..అదృష్టవశాత్తు ఆ సినిమాలు నా కోరికను తీర్చాయి. ఎం ఎస్ ధోనీ సినిమా తర్వాత వచ్చిన బాఘీ 2 చిత్రం ఘన విజయం సాధించి..100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా నా అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. నా సినీ కెరీర్‌లో ఇంత తక్కువ సమయంలో సల్మాన్‌ఖాన్ తో కలిసి నటిస్తానని అనుకోలేదు. భారత్ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. చాలా సవాలుతో కూడుకున్న పాత్రలో నటిస్తున్నా. ఈ సంవత్సరమంతా నాకు అనుకూలంగా గడిచింది. ఇది గొప్ప సంవత్సరం మంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది  ఈ భామ‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa