నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హిందీలో నటిస్తున్న తొలి చిత్రం "గుడ్ బై". ఆకట్టుకునే, అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాగా, అక్టోబర్ 7వ తేదీ నుండి ఈ సినిమా ప్రేక్షకులను అలరించదానికి సిద్ధమైంది.
ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది. అమితాబ్ తో కలిసి నటించడం పట్ల పలుమార్లు సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూలలో రష్మిక తన కల నిజమైనట్టు, చాలా గొప్పగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని మరోసారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఆయనతో కలిసి దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసి... ఇప్పటికి నమ్మాలని అనిపించట్లేదు ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాని, ఆయనతో మాట్లాడుతున్నానని, ఆయనతో ఫోటో దిగుతున్నానని, ఆయనతో ఆర్గ్యు చేస్తున్నానని.. ఆయనతో కలిసి నటించడం నిజంగా నా అదృష్టం. గుడ్ బై మూవీ నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది... అని రాసుకొచ్చింది.
వికాస్ బాహ్ల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు. శోభా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో నీనా గుప్త, ఆశిష్ విద్యార్థి, సునీల్ గ్రోవర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.