కొంటె నవ్వుతో కన్నుగీటి, చేతితో గన్ పేల్చిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయినప్పటికీ ఆమెకు సినీ అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. తాజాగా ఆమె పెద్ద పులితో ఆడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెకేషన్‌కు వెళ్లి, పెద్దపులితో ఆడుకుంటున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.