పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేసిన మైథలాజికల్ ఎపిక్ స్టోరీ "ఆదిపురుష్".
నిన్ననే ఈ మూవీ టీజర్ ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయు నదీతీరాన జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ అయ్యింది. ప్రభాస్ అభిమానుల నుండి ఈ టీజర్ కు అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
అయోధ్యలో ఆ శ్రీరాముడి ఆశీస్సులతో ఆదిపురుష్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసిన చిత్రబృందం దసరా పండుగను పురస్కరించుకుని ఢిల్లీలో మరొక ఘనకార్యక్రమానికి రెడీ అవుతుంది. న్యూ ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో రావణ దహన కార్యక్రమానికి ఆదిపురుష్ టీం వెళ్లనుంది. అలానే ఆ కార్యక్రమంలో ప్రభాస్ రావణ, కుంభకర్ణ, మేఘనాథుడి విగ్రహాలను విల్లు ఎక్కి పెట్టి దహనం చెయ్యబోతున్నాడు.