పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్" యొక్క టీజర్ నిన్న రాత్రి విడుదలైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల నుండి ఈ టీజర్ కు విశేష స్పందన వస్తుంది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తుండగా, భూషణ్ కుమార్, రెట్రోఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
నిన్న అయోధ్యలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ... ప్రభాస్ తో ఇప్పటివరకు సాహో, రాధేశ్యామ్ సినిమాలను నిర్మించాను. తాజాగా భారీ బడ్జెట్ తో ఆదిపురుష్ నిర్మించాను. త్వరలోనే మా కాంబోలో మరొక సినిమా కూడా రాబోతుంది... అని చెప్పి మరొక భారీ సినిమా ప్రభాస్ నుండి రాబోతుందని ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
ఐతే, ఆ సినిమా డైరెక్టర్ ఎవరన్నది భూషణ్ కుమార్ రివీల్ చెయ్యలేదు.
పోతే, ఆదిపురుష్ మూవీ పాన్ ఇండియా భాషల్లో వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.