సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా 'హంట్'.ఈ సినిమాకి మహేష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ తేదిని ప్రకటించారు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం ఉదయం 11.06 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.