నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా 'దసరా'. ఈ సినిమాకి శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'ధూమ్ ధామ్ దోస్తాన్' అనే పాటను రేపు విడుదల చేయనున్నారు. దసరా పండుగ సందర్భంగా ఎలాంటి ప్రోమో విడుదల చేయబోమని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలిపారు. అందుకే షూటింగ్ టైమ్ లో మొబైల్ లో రికార్డ్ చేసిన వీడియోని నేను లీక్ చేస్తున్నా. రేపటి నుంచి దుమ్ము లేచిపోద్ది అని నాని ట్వీట్ చేశారు.ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా 2023న మార్చి 30 విడుదల కానుంది.