పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం" హరిహర వీరమల్లు". ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం విదేశీ నిపుణులు కూడా పని చేయడం విశేషం. త్వరలో జరగనున్న యాక్షన్ షెడ్యూల్ కోసం చిత్రబృందం ప్రత్యేక సెట్‌ను కూడా నిర్మించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ షాప్ జరగనుంది. ఈ పాన్ ఇండియా సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతుంది.