టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం "ది వారియర్" మూవీ మిగిల్చిన నిరాశలో ఉన్నారు. కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి డైరెక్షన్లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
దీంతో రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖండ విజయంతో ఫుల్ సక్సెస్ జోష్ లో ఉన్న బోయపాటితో రామ్ తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నాడన్న విషయం తెలిసిందే కదా. దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ ఐదవ తేదీన ఈ మూవీ నుండి ఎక్జయిటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఎప్పటినుండో ఈ మూవీ హీరోయిన్ సెట్ అవ్వట్లేదని, బోయపాటి చాలా మంది హీరోయిన్లను పరిశీలించి ఏజెంట్ భామ సాక్షి వైద్య ను ఫిక్స్ చేసారని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోతే, ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.